తెలంగాణ మహిళలకు శుభవార్త..నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

-

తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు చీరలను కానుకగా అందిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 నుంచే చిన్న బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో…. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు.

ఇవాళ్టి నుంచే హైదరాబాద్‌ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ నుంచి వచ్చిన 240 డిజైన్‌ చీరలను ఆడపడుచులకు అందించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి చీరల పంపిణీ ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 డివిజన్లలో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా పంపిణీ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version