MS Dhoni: పాక్ నుంచి ధోనీకి ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?

-

ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఆట తీరు, వ్యక్తిత్వంతో దేశ ,విదేశాలలో అభిమానులను సంపాదించుకున్నడు. ధోనీ తనదైన కెప్టెన్సీ తో క్రికెట్ కెరియర్లో ఎన్నో మ్యాచ్లలలో విజయాలను అందించాడు. ధోని ఇండియాకి రెండు ప్రపంచా కప్ లను అందించాడు. ధోని టోర్నీల కోసం 2006-08 మధ్య పాకిస్థాన్లో పర్యటించినప్పుడు అక్కడ తిన్న భోజనం తనకు ఎంతో నచ్చిదంటూ మహేంద్రసింగ్ ధోని తెలిపిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.

 

ఈ వీడియోపై పాకిస్థాన్ స్పోర్ట్స్ యాంకర్ ఫఖర్ ఆలం స్పందిస్తూ…… ఎంఎస్ ధోని పాకిస్థాన్ ఫుడ్ ని ఇష్టపడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేవలం క్రికెట్ ఆడడానికి మాత్రమే కాకుండా ఆహారం తినేందుకు ఓ సారి పాకిస్థాన్కు రావాలని హృదయపూర్వకంగా ధోనిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ధోనీ తన హెయిర్టెల్ గురించి మాట్లాడుతూ గతంలో తాను యాడ్ ఫిల్మ్ కోసం వెళ్లినప్పుడు మేకప్, హెయిర్ స్టైల్ కోసం కొన్ని నిమిషాల సమయమే తీసుకునేవాడినని అన్నారు. కానీ ప్రస్తుతం గంటకు పైగా సమయం పడుతోందన్నాడు. ఈ హెయిర్ స్టైల్ ని కొనసాగించడం కాస్తా కష్టమే అయినా.. తన ఫ్యాన్స్ కోసం మరికొన్ని రోజులు ఆ స్టైల్లోనే ఉంటానంటూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version