Tenth Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

-

తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు రిలీజ్ చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి అని బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.

18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 19న సెకండ్‌ లాంగ్వేజ్‌, 21న ఇంగ్లిష్‌, 23న మ్యాథ్స్‌, 26న సైన్స్‌ మొదటి పేపర్‌, 28న సైన్స్‌ రెండవ పేపర్‌, 30న సోషల్‌ స్టడీస్‌, 1వ తేదీన ఒకేషనల్‌ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ మొదటి పేపర్‌‌, 2న రెండవ పేపర్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version