పాకిస్థాన్ క్రికెటర్ కు మహేంద్ర సింగ్ ధోని స్పెషల్ గిఫ్ట్

-

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జార్ఖండ్ డైనమైట్ గా పేరుతెచ్చుకున్న ధోని… మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా నిలిచాడు. అయితే.. కేవలం ఆటతోనే కాకుండా.. ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా ధోని చాలా మంది అభిమానుల మనసు సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా పాకిస్థాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు ధోని. ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన తన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీని పాక్‌ ప్లేయర్‌ కు పంపించాడు. ఈ విషయాన్ని వరూఫ్‌ తాజాగా ట్విట్టర్ లో ప్రకటన చేశాడు. ” కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన జెర్సీ ఇది. ఈ నెంబర్‌ 7. ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు” అంటూ ధోని పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ఈ పాక్‌ ఆటగాడి పోస్ట్‌ కు.. సీఎస్‌ కే మేనేజ్‌ మెంట్‌ కూడా స్పందించింది. కాగా… ఐపీఎల్‌ 2021 లో ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఛాంపియన్‌ గా నిలిపిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version