గుప్పెడంతమనసు ఎపిసోడ్ 342: వసుధారను ప్రేమిస్తున్నాను అని రిషీకి చెప్పేసిన గౌతమ్..షాక్ లో ఇగోమాష్టర్

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రిషిగాడికి దొరికేశా అనుకుంటూ వెళ్లిన గౌతమ్ అందర్నీ పలకరిస్తాడు. మహేంద్ర గౌతమ్ నీకేదో పనుందన్నావ్. నా కార్లో వచ్చి సగం దారిలో దిగిపోయావు అని మహేంద్ర అనగానే.. గౌతమ్ మనసులో అందరి ముందు అడగాలా అంకుల్ అనుకుని.. ఆపని అవలేదంటాడు. జగతిమేడమ్ ని..వాటర్ అడుగుతాడు. ఇక్కడే ఉన్నాయని రిషీ దగ్గర వాటర్ బాటిల్ తీసుకోడానికి వెళ్తాడు.. నువ్వెందుకు వచ్చావ్ అంటే నువ్వెందుకు వచ్చావ్ అని గౌతమ్-రిషి అనుకుంటారు. ఈ రోజు పెండింగ్ లో ఉన్న మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ చేయాలి మనం అని రిషి అనగానే.. వసూకి అందరికి కాఫీ తెమ్మని జగతి అనడంతో..ఏం వద్దు అంటాడు రిషి. మహేంద్ర కాఫీ వద్దు అని..మిర్చిబజ్జీలు తింటే బాగుంటుంది అంటాడు. గౌతమ్ కూడా వంతపాడతాడు..రిషీ వీళ్లిద్దరిని అదుపు చేస్తాడు. గౌతమ్..అంకుల్ మీరేంటి ఇలా వచ్చారని గౌతమ్ అడగడంతో అంతా మొహాలు చూసుకుంటారు…పైగా నాలాగే చనువుగా మిర్చి బజ్జీ పకోడి అంటున్నారని అన్న గౌతమ్..మేడం-మీరు క్లాస్ మేట్స్ అనుకుంటా అందుకే ఇంత ఫ్రీగా ఉంటున్నారని అంటాడు. రిషీ నోర్మోయ్ రా..పెద్దవాళ్లను అలా అడగొచ్చా.. అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని గౌతమ్ ని రిషి అడుగుతాడు..నువ్వెందుకు వచ్చావని రివర్స్ లో అడిగితే మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కోసం అని రిషి చెప్పడంతో నేను కూడా అందుకే వచ్చా అంటాడు గౌతమ్. ఏంటీ నమ్మడం లేదా అంటూ జేబులోంచి పెన్ డ్రైవ్ తీసి ఇస్తాడు. షాట్ ఫిల్మ్ కోసం నేను కూడా కొంచెం మెటిరీయల్ తెచ్చాను అని పెన్ డ్రైవ్ వసూకి ఇస్తాడు. అందరం కలిసాం కదా అలా వెళ్లి డిన్నర్ చేద్దామా అంటే.. రిషీ ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ లేవు తమరు వెళ్లొచ్చు అంటూ మహేంద్ర కార్ కీ గౌతమ్ కి ఇచ్చి పంపించేస్తాడు. నేను అంకుల్ కార్ లో వెళ్తే నా అంకుల్ ఎలా వస్తారు అంటే..నా కారులో వస్తారు అంటాడు రిషీ. రిషీ-మహేంద్రలు కూడా అక్కడినుంచి వెళ్తారు.

రిషీ- మహేంద్ర

ఓ గ్రౌండ్ లో కార్ ఆపిన రిషి.. మహేంద్రను దిమంటాడు. మహేంద్ర డౌట్ గానే కారు దిగుతాడు. తండ్రి చేయి పట్టుకుని సారీ డాడ్ అనడంతో..నువ్వెందుకు సారీ చెబుతున్నావ్ అని అడుగుతాడు మహేంద్ర. గౌతమ్ అంటాడు రిషీ..గౌతమ్ ఏదో అన్నాడని నేను ఫీలవుతున్నా అని నువ్వు ఫీలవుతున్నావా అంటాడు. నేను అక్కడ మౌనంగా ఉండాల్సివచ్చింది.. గౌతమ్ కి మీ గురించి పూర్తిగా తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు..అలాంటి సందర్భం మీరు ఎదుర్కోవడం నాకు బాధకలిగించిందని రిషి అంటే..ఇవన్నీ జరగడానికి నేను కూడా కారణమేమో.. అక్కడకు నేను రావాల్సింది కాదేమో అంటాడు మహేంద్ర. మీరు ప్రపంచంలో నాకు తప్ప ఎవ్వరికి సారీ చెప్పినా బాధపడతాను..అలా అని నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు..డాడ్ యుఆర్ మై హీరో.. నా జీవితంలో మీరే నా హీరో..మీరు ఏ తప్పూ చేయలేదు..మీరు ఎక్కడా తలదించుకోవాల్సిన అవసరం లేదు..దేనికీ బాధపడాల్సిన పనిలేదు.. మీకెప్పటికీ నేను రక్షణగా ఉంటాను మిమ్మల్ని ఎవరైనా ఒక్కమాట అనాలంటే నన్ను దాటి వెళ్లాల్సిందే అని ఏమోషనల్ అవుతాడు రిషి. మీ మనసుకి నచ్చింది మీరు చేయండి అంటాడు. ఈ సీన్ కాస్త ఎమోషనల్ గా ఉంటుందిలే.
ఇంటి ముందు కూర్చుని గౌతమ్ ఇచ్చిన పెన్ డ్రైవ్ చూస్తూ.. ఆలోచనలో పడిన వసుధార దగ్గరకు వచ్చిన జగతి వస్తుంది…ఒక విషయం అడుగుతాను చెప్పు వసూ..అని రిషి కోపం బావుంటుందా-సహనం బావుంటుందా అని అడుగుతుంది. మేడం రిషి సర్ సహనమే బావుంటుందని వసు అంటే.. కానీ నాకు రిషీ కోపమే బావుందేమో అనిపించింది వసు అంటుంది జగతి. రిషి…రిషిలా ఉంటేనే బావుంటుంది..తన కోపాన్ని అదుపులో పెట్టుకుని మహేంద్రకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని రిషి పడిన ఆరాటం నేను చూశాను..తల్లిగా నా మనసుకి చాలా బాధేసింది..నిజమైన కష్టం అంటే మనం కష్టాలు పడడం కాదు..మనకు ఇష్టమైన వాళ్ల మనకోసం కష్టపడుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోతాం చూడు..ఆ పరిస్థితి రావడమే నిజమైన కష్టం… చాలా సార్లు అనిపిస్తుంది వసూ..రిషి నన్ను ద్వేషించటంలో తప్పులేదేమో అని..నాతో కథలు వినే అ‌వకాశం మిస్ అయ్యాడు..అమ్మ ప్రేమను మిస్ అయ్యాడు..తన ద్వేషంలో న్యాయం ఉంది..వాడి కోపంలో నిజం ఉంది.. వాడు మా ఇద్దరి గురించి గౌతమ్ కి తెలియకూడదని పడే తపన చూసి బాధేసింది వసూ…వాడి బాల్యాన్ని అందంగా మార్చలేకపోయాను..భవిష్యత్ లో కొంతైనా ఆనందాన్ని ఇవ్వగలిగితే చాలని చూస్తున్నా అనేసి జగతి అక్కడి నుంచి లేచెళ్లిపోతుంది. ఆ రోజు తప్పకుండా వస్తుంది మేడం అంటుంది వసుధార.
రిషి గీసిన వసుధార బొమ్మ ముందు కూర్చుని ఓ తెగ చూస్తుంటాడు గౌతమ్. ఏరా ఇంకా పడుకోలేదా అని రిషీ అంటే.. ఎందుకురా..నా మీద కాన్స్ ట్రేట్ చేస్తున్నావ్…నువ్వెందుకురా నన్ను వెంటాడుతున్నావ్ అంటాడు. అయినా నువ్వు పరగెడుతున్నావ్ కదా అంటే.. అయినా కాళ్లకు కాళ్లు అడ్డంపెట్టి ఆపేస్తున్నావ్ కదా అంటాడు గౌతమ్. సాధ్యమైతే నాకు హెల్ప్ చేయి..కానీ..ఇలా అడ్డుపడడం బాలేదని బాధపడతాడు గౌతమ్. నువ్వు నా ఫ్రెండ్ వి దేనికి సపోర్ట్ చేయాలో నాకు తెలుసు అంటాడు రిషి. ఏంటో నీ కోపాన్ని తట్టుకోలేను, నీ ప్రేమను భరించలేను..అందుకే ఓ పని చేస్తా అంటాడు. ఏం పని కూడా అడగవేంట్రా అని రిషి వైపు చూస్తుంటే..చెబితే చెప్పు లేదంటే లేదు అనేసి వెళ్లిపోతాడు రిషి. గౌతమ్ వీడేంటో..వీడేంటో మొండిగటం అనుకుని..వసూ ఫోటో చూస్తూ.. నా ప్రేమకి అందరూ విలన్స్ లా తయారయ్యారని నా మనుసులో నువ్వుండగా నీ కళ్లు నేను గీయలేకపోయాను.. మరి రిషి ఇంత అందంగా ఎలా గీయగలిగాడు అనుకుంటాడు గౌతమ్. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో

కాలేజీ మెట్ల దగ్గరున్నా అని మెసేజ్ చేసిన వసు దగ్గరకి వెళతాడు రిషి. సార్ నాకు చాక్లెట్ తినాలని ఉందంటుంది. నేనేం చేయాలని అడిగుతాడు రిషి. మీరు తింటే తిందాం అనుకుంటున్నా అంటుంది. ఇద్దరూ చాక్లెట్ షేర్ చేసుకుంటారు. మరో సీన్ లో గౌతమ్ రిషీని నాకొక లవ్ లెటర్ రాసిపెట్టాలి అంటాడు. నేను వసుధారని ప్రేమిస్తున్నాను అని ఓపెన్ అయిపోతాడు గౌతమ్..రిషీకి సౌండ్ ఆఫ్.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version