అశోక్ గజపతిరాజుకు అవమానం : సిఎం జగన్ కు ముద్రగడ లేఖ

-

తూర్పుగోదావరి : ఏపీ సి.ఎం.జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. అశోక్ గజపతిరాజుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై జగన్‌కు ముద్రగడ లేఖ రాశారు. అశోక్ గజపతిరాజుని జైలుకు పంపుతామని ఎం.పి విజయయిరెడ్డి అనడం బాధాకరమని.. అశోక్ గజపతిరాజును అవమానించద్దని పార్టీ నాయకులకు జగన్ ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు ముద్రగడ. ఉభయ తెలుగు రాష్ట్రాల క్షత్రియులు చేసిన ప్రకటనను సీరియస్ గా తీసుకుని… పరిశీలించుకోవాలని.. లేఖలో పేర్కొన్నారు. రాజ్యాలు పోయినా అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని అందరూ గౌరవిస్తారని.. అశోక్ గజపతిరాజు కటుంబం వేల ఎకరాలు ధారాదత్తం చేసి ట్రస్ట్ లు ఏర్పాటు చేశారని లేఖలో ముద్రగడ తెలిపారు.

అశోక్ గజపతిరాజుపై అసభ్యంగా మాట్లడకుండా వైసీపీ నాయకులను కట్టడి చేయాలని కోరారు. కాగా.. మాన్సస్ ట్రస్ట్ లో వందల ఎకరాలు కాజేసిన చేసిన పెద్ద దొంగ అశోక్ గజపతిరాజు అని.. అశోక్ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందని ఇటీవలే విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజు జైలుకి వెళ్లడం ఖాయమని.. మాన్సస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్ కు వెళ్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version