భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో కంపెనీ లో అతి పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో దిగ్గజ వ్యాపార సామ్రాజ్యంలో యాజమాన్య మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో కంపెనీ లో టెలికామ్ మేనేజర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇకపై రిలయన్స్ జియో బోర్డు చైర్మన్ గా.. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ నియామకానికి ఈ రోజు ఆమోదం తెలిపినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం జూన్ 27న (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో బోర్డు అనేక నిర్ణయాలను తీసుకుంది. ఇక్కడే ఆకాశ్ అంబానీని కంపెనీ చైర్మన్ గా నియమిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదముద్ర వేశారు. రిలయన్స్ జియో లో కీలక మార్పులు చోటు చేసుకోవడం కార్పొరేటర్ సెక్టార్లో చర్చనీయాంశమైంది. ఏకంగా ముకేశ్ అంబానీ తప్పుకోవడం ఆసక్తి రేపుతోంది.