ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏడు లక్షల కోట్లు అప్పలపాలు చేసింది : భట్టి విక్రమార్క

-

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుంది. ప్రతి పైసా పోగుచేసి దాన్ని ప్రజల కోసమే ఖర్చు పెడతాం. రాష్ట్రంలో సంపాదన సృష్టిస్తాం ప్రజల కోసం ఖర్చు చేస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శంకుస్థాపన జరిగిన ప్రతి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను వచ్చే వార్షిక సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొస్తాం. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన కాలంలో… కాస్మెటిక్ చార్జీలు, డైట్ చార్జీలు పెంచలేదు. 40% కాస్మోటిక్, డైట్ చార్జెస్ పెంచి ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల మా చిత్తశుద్ధిని స్పష్టం చేశాము.

ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కు అప్పజెప్పితే.. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పలపాలు చేశారు. విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా ప్రభుత్వం వెనకాడబోదు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలనేదే మా ఆకాంక్ష. గత ప్రభుత్వం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. కనీసం పర్యావరణ అనుమతులు కూడా ఇవ్వలేదు. ఒక్క కిలోమీటర్ SLBC టన్నెల్ కూడా తవ్వని చరిత్ర బిఆర్ఎస్ పార్టీదీ. 20 నెలల్లో ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తాం. ప్రతి పైసా ప్రజలకే.. పాలకులు పంచుకుని తినడానికి కాదు అని డిప్యూటీ సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version