కోట్లాడి తెచ్చిన తెలంగాణలో పరాయి పాలనలోకి వెళ్లినట్టు ఉన్నం : కోదండరాం

-

అందరం కొట్లడితేనే తెలంగాణా రాష్ట్రం వచ్చింది. అటుకులు బుక్కి నేనే తెచ్చిన అంటే అది అబద్ధం అని కోదండరాం అన్నారు. కార్మిక, కర్షక, సబ్బండ వర్గాలు కొట్లడితేనే తెలంగాణ వచ్చింది. పది సంవత్సరాల పాటు మన చరిత్రను మనం మర్చిపోయినం. అలా చెరిపి వేశారు. కారణం ఏదైనా అది మరల గుర్తుకు రావడం సంతోషం పొద్దున్న లేస్తే అరెస్టు చేయడం,ఇబ్బందులకు గురి చేశారు. రైల్ రోకో,రైల్ కు అడ్డం పడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కోకొల్లలు.

ఈ రాష్ట్రం మన అందరిదీ.నీళ్లు నిధులు నియామకాలు కోసం కొట్లాడి కనుమరుగయ్యాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నీ ఎన్నుకున్నం. ఉద్యోగుల డి ఏ దగ్గర నుండి అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు. కోట్లాడి తెచ్చిన తెలంగాణలో పరాయి పాలనలోకి వెళ్లినట్టు ఉన్నం. పదేళ్లపాటు పాకిస్థాన్ ఇండియా బోర్డర్ లాగా సెక్రటరేట్ పరిసరాలను చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేశారు, మనిషికి గౌరవం లేకుండా చేశారు అని కోదండరాం ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version