రాత్రిళ్లు సినిమా థియేటర్లలో చిన్న పిల్లలను అనుమతించకూడదని ఇటీవల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అలో చేయద్దని తీర్పు చెప్పింది. ఉదయం 11 గంటల ముందు రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు లేదా మల్టీప్లెక్స్‌లలోకి ప్రవేశించడాన్ని నియంత్రించడంపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.’
ఈ క్రమంలోనే పిల్లలను సినిమా థియేటర్లకు అనుమతించకపోతే తాము నష్టపోతామని, ఉదయం 11 గంటలలోపు రాత్రి 11 గంటల తరువాత చిన్న పిల్లలను అనుమతించాలని.. లేకపోతే తాము నష్టపోతున్నామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. కాగా, దీనిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.