బాలుడి పిత్తాశంలో కొబ్బరికాయ సైజు రాయి.. శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యుడు

-

కోల్‌కత: 17 ఏళ్ల బాలుడు రూబెన్ షేకా పిత్తాశయంలో కొబ్బరి కాయ సైజులో రాయి ఉంది. ఈ రాయిని వైద్యులు శస్త్ర చికిత్స చేసి తీసేశారు. ముంబైకు చెందిన డాక్టర్ రాజీవ్ రెడ్కర్ ఈ శస్త్ర చికిత్స చేశారు. ఈ రాయి కిలో ఉన్నట్లు రెడ్కర్ గుర్తించారు. బాలుడికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఆపరేషన్ చేసి ఈ రాయిని బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాలుడు అనాథ కావడంతో డాక్టర్ రాజీవ్ రెడ్కర్ ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. బాలుడికి ఇదేవరకే ఓసారి ఆపరేషన్ చేశారు. మళ్లీ ఇప్పుడు బాలుడికి రెండోసారి ఆపరేషన్ చేసి కొత్త జీవితం ఇవ్వడం విశేషం.

బాలుడు పుట్టినప్పుడే పిత్తాశయంలో రాయితో పుట్టినట్లు పేర్కొన్నారు. అయితే రాయి ఉండవల్ల బాలుడు మూత్రం పోయడానికి చాలా ఇబ్బందులు పడేవాడు. మూత్రం విసర్జన సమయంలో తీవ్ర నొప్పితే అల్లాడిపోయేవాడు. అంతేకాదు అంగస్థంభన సమస్య కూడా ఉండేదట. అయితే 15 ఏళ్ల క్రితమే బాలుడికి వైద్యుడు రాజీవ్ రెడ్కర్ శస్త్ర చికిత్స చేశారు. బొడ్డుపైన ఓ పైపును ఏర్పాటు చేసి మూత్రం బయటకు పోయేలా శస్త్ర చికిత్స చేశారు. అయితే ఇప్పుడు పిత్తాశయంలో ఏర్పడిన కిలో రాయిని జూన్ 30న వైద్యుడు ఆపరేషన్ చేసి తొలగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version