L .RAMANA : టీఆర్‌ఎస్‌లోకి ఎల్‌. రమణ.. కేసీఆర్‌ తో కీలక భేటీ

-

టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ను కలువనున్నారు ఎల్‌ . రమణ. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌ రమణ పనిచేస్తున్నారు. రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లడానికి ఎల్‌. రమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఈటల స్థానంలో కరీంనగర్‌ నుంచి మరో బీసీ నాయకున్ని తీసుకునే.. ప్రయత్నంలోనే ఎల్‌. రమణకు టీఆర్‌ఎస్‌ గాలం వేసినట్లు తెలుస్తోంది.

ఎల్ రమణ… టీఆర్‌ఎస్‌లోకి వస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు..టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరితే.. ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేసారని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లేందుకు ఎల్‌ రమణ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని…ఇందులో భాగంగానే కార్యకర్తలతో సమూల చర్చలు జరిపారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీ  కండువా కప్పుకోనున్నారు ఎల్ రమణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version