ముంబై డ్రగ్స్ అడ్డాగా మారింది – సీపీ సీవీ ఆనంద్

-

హైదరాబాద్ లో డ్రగ్స్ ను రూపుమాపడానికి చాలా వ్యూహాలతో నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ముందుకు పోతుందన్నారు సిపి సివి ఆనంద్. డ్రగ్స్ పెడ్లర్లు తోపాటు డ్రగ్స్ సేవించే వారిలో భయాన్ని తీసుకొచ్చామన్నారు. ముంబై కేంద్రంగా ఇప్పుడు డ్రగ్స్ అడ్డాగా మారిందన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో
గోవా పోలీస్ గతంలో మాకు సహకారం అందించాలేదని.. ఇప్పుడు ముంబై కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ ముఠాలపై మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.

వారి సహకారంతో ముంబై లో కూడా ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. కొద్దీ రోజుల్లోనే T ల్యాబ్ అందుబాటులోకి తెస్తున్నామని, దాని ద్వారా మరింత నిఘా పెడుతామన్నారు. ముంబై కేంద్రంగా అమ్మబడుతున్న నార్కోటిక్ డ్రగ్ MDMA గా గుర్తించామన్నారు. సనా ఖాన్ అనే ఒక స్టూడెంట్ .. ఓ ఐటీ కంపనీ లో పని చేస్తుందని, ముంబై వెళ్లి అక్కడ డ్రగ్స్ సేవిస్తుందని, ఒక గ్రాము మూడు వేలకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ కి సనా ఖాన్ డ్రగ్స్ తెచ్చి ఒక గ్రాము 7 వేలకు అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు సిపి.

హైదరాబాద్ కి చెందిన 40 మంది , ముంబై లో 70 మంది స్నేహితులకు అమ్మకాలు చేస్తుందన్నారు. ముంబైలో ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ ను త్వరలో పట్టుకుంటామన్నారు. కిలో MDMA కు ఆరు లక్షలు అమ్మకాలు చేస్తిన్నట్లు గుర్తించామన్నారు. ముంబై లోని మలాద్ ప్రాంతం నుండి శంషఉద్దీన్ ద్వారా ట్రాన్స్ఫర్ట్ చేస్తున్నారని.. జతిన్ భాలచంద్ర భలేరావు కి పంపుతున్నారని తెలిపారు. ఏడాది కి 12 లక్షలు విలువైన డ్రగ్స్ అమ్మకాలు చేసినట్లు గుర్తించామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version