ఫిబ్రవరి 16న లాంచ్‌ కానున్న iQOO Neo 7 5G. లీకైన ఫీచర్స్..!

-

ఐకూ నుంచి కొత్త ఫోన్‌ త్వరలో లాంచ్‌ కానుంది. iQOO Neo 7 5G. ఫిబ్రవరి 16న ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ లీక్‌ అయ్యాయి. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దామా..!

 ధర (అంచనా)

ఐకూ నియో 7 5జీ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇండియాలో రూ. 26,999గా ఉండనుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ట్విట్టర్ ద్వారా లీక్ చేశారు.
దీని టాప్ ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30 వేల నుంచి రూ.32 వేల మధ్య ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఫిబ్రవరి 19వ తేదీ లేదా 20వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.
మీకు ఈ స్మార్ట్‌ఫోన్‌పై కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా లభించే అవకాశం ఉంది.

స్పెసిఫికేషన్లు (అంచనా)

ఐకూ నియో 7 5జీలో మీరు ఫుల్‌హెచ్‌డీప్లస్ రిజల్యూషన్‌తో ఉన్న 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు.
ఇది 120hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌పై పని చేస్తుంది.
ఈ మొబైల్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుతారు.
ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
కెమెరా పరంగా చూసుకుంటే మొబైల్ ఫోన్ వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో మీరు 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరాలను పొందుతారు. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఐకూ నియో 7 5జీలో కంపెనీ మీకు రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను ఇస్తుంది. అలాగే మీరు మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లను కూడా పొందుతారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version