చెల‌రేగిన ముంబై.. హైద‌రాబాద్ టార్గెట్ 209..

-

షార్జాలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 17వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ విజృంభించింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుపై ముంబై బ్యాట్స్‌మెన్ చెల‌రేగిపోయారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

ముంబై బ్యాట్స్‌మెన్ల‌లో క్వింట‌న్ డికాక్ 39 బంతుల్లోనే 6 ఫోర్ల‌తో 67 ప‌రుగులు చేయ‌గా, ఇషాన్ కిష‌న్ 23 బంతుల్లోనే 1 ఫోర్‌, 2 సిక్స‌ర్ల‌తో 31 ప‌ర‌గులు చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా (28 ప‌రుగులు), కృనాల్ పాండ్యా (20 నాటౌట్‌), కిర‌న్ పొలార్డ్ (25 నాటౌట్‌)లు చివ‌ర్లో మెరుపులు మెరిపించారు. దీంతో ముంబై భారీ ల‌క్ష్యాన్ని హైద‌రాబాద్ ఎదుట ఉంచ‌గ‌లిగింది. ఇక హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ‌, సిద్ధార్థ కౌల్‌లు చెరో 2 వికెట్లు తీయ‌గా, ర‌షీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version