అబుధాబిలో మంగళవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 20వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక రాజస్థాన్ చేతులెత్తేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయారు. దీంతో రాజస్థాన్‌పై ముంబై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో సూర్య కుమార్ యాదవ్ విజృంభించాడు. 47 బంతుల్లోనే 11 ఫోర్లు, 2 సిక్సర్లతో రాజస్థాన్‌పై విరుచుకు పడి 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేయగా, చివర్లో హార్దిక్ పాండ్యా 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో ఎస్ గోపాల్ 2 వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్, కార్తిక్ త్యాగిలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 18.1 ఓవర్లకే చాప చుట్టేసింది. 136 పరుగులకు ఆలౌట్ అయింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో జాస్ బట్లర్ ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో బట్లర్ 70 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా ఏకంగా 4 వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. అలాగే ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ ప్యాటిన్సన్‌లు కూడా చెరొక 2 వికెట్లు చొప్పున తీసి ముంబైని విజయతీరాలకు చేర్చారు. ఇక రాహుల్ చాహర్, కిరన్ పొల్లార్డ్‌లకు చెరొక వికెట్ దక్కింది.