దారిద్ర్య బాధలు పోవాలంటే ఇలా చేయండి !

-

మానవ జీవితంలో దారిద్య్రాలు అనేక రకాలు. సంపద లేక కొందరు, ఆరోగ్యం లేకుండా, సంతానం లేక ఇలా అనేక రకాల దారిద్య్రాలు ఉంటాయి. వీటినించి విముక్తి పోవడానికి పూర్వీకులు చెప్పిన పరిహారాలలో సులభమైనది, ఖర్చులేనిది తెలుసుకుందాం.. ప్రతి రోజూ పఠించాల్సిన దారిద్ర్య విమోచక స్తోత్రం.. జగన్మాత శ్రీమహాలక్ష్మీ స్మరణం అన్ని రకాలైనటువంటి దారిద్ర్యాల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీనికోసం లక్ష్మీదేవి 108 నామాలైన “శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామా” లను నిత్యం చదివితే, సర్వ దరిద్రాలు తొలుగుతాయని, సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు. ముందుగా ఆ తల్లిని శ్రద్ధగా ధ్యానించి. ఆ తరువాత దారిద్ర్య విమోచన స్తోత్రాన్ని పఠించాలి. లక్ష్మీదేవిని కొంది శ్లోకంతో ధ్యానించాలి..

ధ్యానం:
‘‘వందే పద్మాకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం.
హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానా విధైర్భూషితాం
భక్తా భీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మదిఖి:
సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభి:
సరసిజ నయనే సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి, ప్రసీద మహ్యమ్’’
ఈ శ్లోకం చదివి లక్ష్మీ అష్టోతరం చదివితే దాన్ని దారిద్ర్య విమోచన స్తోత్రాం అంటారు. దీని నిత్యం పఠించేవారికి, అన్ని రకాలైన దారిద్ర్యలు తొలగి శుభం కలుగుతుంది.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version