BRS పార్టీలో నరకం చూసానని సిరిసిల్ల మున్సిపల్ 6 వ వార్డ్ కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజన్ చెప్పారు గురువారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం బిఆర్ఎస్ పార్టీలో చేరానని 15 ఏళ్ల పార్టీలో నరకం అనుభవించారని మండిపడ్డారు ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యంగా కృంగిపోయానని అన్నారు.
ఆ పార్టీలో గుర్తింపు లేక మనస్థాపానికి గురైనట్లు చెప్పారు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వచ్చినందుకు బుద్ధి వచ్చిందని మళ్లీ అదే పార్టీలోకి వెళ్లడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు సిరిసిల్ల అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని మరో 400 మంది కార్యకర్తలతో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.