మునుగోడు ప్రజలకు కెసిఆర్ ను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టే అవకాశం వచ్చింది – రేవంత్ రెడ్డి

-

మునుగోడు ప్రజలకు ఈ ఉప ఎన్నిక ద్వారా సీఎం కేసీఆర్ ను 100 మీటర్ల గోతిలో పాతి పెట్టే అవకాశం వచ్చిందని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు లో ఆడబిడ్డల ఆత్మగౌరవ గర్జన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు తీసుకునే నిర్ణయమే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని పేర్కొన్నారు.

కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి చంపాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని.. డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ, దళితులకు భూమి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చని కెసిఆర్ ఎన్నికలు వచ్చేసరికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఓటు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన బిజెపి ఇప్పుడు అభివృద్ధి పేరుతో ప్రజల ముందుకు వస్తుందని మండిపడ్డారు. పాల్వాయి స్రవంతిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version