వీడిన మర్డర్ మిస్టరీ..ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చిన భార్య

-

ఏపీలో గత మూడు రోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి కేసును పిచ్చటూరు పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్దారించారు. సుగంధి అనే మహిళ తన ప్రియుడు అరుల్ రాజ్‌తో కలిసి కట్టుకున్న భర్త అంటోనీని ఉరితాడు బిగించి హత్య చేసింది.

అరుల్ రాజ్-సుగంధిలకు గత 12 సంవత్సరాల నుండి పరిచయం ఉంది. వివాహం అయ్యాక కూడా తన ప్రియుడితో కలిసి ఆమె అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. వీరిద్దరికి తన భర్త అడ్డు వస్తున్నాడని, అందుకు ఆయన్ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన సుగంధి.. ప్రియుడు అరుల్ రాజ్‌తో కలిసి దారుణంగా తాడుతో మెడకు బిగించి హతమార్చింది. ఈనెల 25వ తేదీన హత్య జరగగా.. పోలీసులు కేసు ఫైల్ చేసి విచారణ అనంతరం భార్యే హంతకురాలిగా తేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version