ఆ పథకాలు ఏమయ్యాయో ఇందిరమ్మకే తెలియాలి.. హరీష్ రావు ఆసక్తికర ట్వీట్..!

-

మాట తప్పడం.. మడమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు  విమర్శించారు. పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారు.. ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్  వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. Dec 9, 2023 కు రుణమాఫీ, ఆగస్టు 15, 2024 వరకు రుణమాఫీ, దసరా వరకు రుణమాఫీ.. అంటూ నేటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ అందలేదని తెలిపారు.

రైతు బంధుపై ఇప్పుడు తీసుకుంటే 10 వేలు, డిసెంబర్ 9, 2023 తర్వాత తీసుకుంటే రైతు భరోసా 15 వేలు చెప్పినట్టు గుర్తుకు చేశారు. అయితే వానాకాలం రైతు భరోసా ఎగరవేశారు, యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు. మాట మార్చి 26 జనవరికి అన్నారు. ఇప్పుడు మార్చి 31 వరకు అంటున్నారు.. అని పేర్కొన్నారు. గత సీఎం కేసీఆర్  రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే, దాన్ని ఎగ్గొట్టి సీఎం రేవంత్  రైతులకు భరోసా లేకుండా చేసిండని మండిపడ్డారు. ఆసరా 4 వేలు, తులం బంగారం, మహిళలకి 2,500, విద్యా భరోసా కార్డు, ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ
భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలి అంటూ సెటైర్లు వేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version