బాలీవుడ్‌లో మరో విషాదం.. సల్మాన్‌ సంగీత దర్శకుడు వాజిద్‌ మృతి

-

బాలీవుడ్‌ యువ సంగీత దర్శకుడు వాజిద్ (42)‌ ఖాన్‌ ముంబైలోని సురానా హస్పిటల్‌లో మరణించారు. గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వాజిద్‌ నాలుగు నెలల క్రితం కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటెషన్‌ చేయించుకున్నాడు. మూడు రోజుల క్రితం కిడ్నీ నొప్పితో హాస్పటల్‌లో అడ్మిట్‌ అయ్యాడని, కిడ్నీలో ఇన్ఫెక్షన్‌ రావడంతో పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి కనుమూశారని వాజిద్‌ సన్నిహితులు తెలిపారు.

వాజిద్‌ మరణం పట్ల బాలీవుడ్‌ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘‘వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేం ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాజిద్ భాయ్ మృతి పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం’’ అంటూ నటి ప్రియాంక చోప్రా ట్వీట్‌ చేసింది.

సాజిద్‌-వాజిద్‌ పేరుతో సంగీతాన్ని అందించే వాజిద్‌ సల్మాన్‌ ఖాన్‌ దబాంగ్‌, వాంటెడ్‌ ,జైబ హో చిత్రాలకు సంగీతాన్నందించాడు. సాజిద్ వాజిద్ ద్వయం లాక్ డౌన్ లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ‘‘భాయ్ భాయ్’’అంటూ ఓ పాటను విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version