సంగీత దర్శకుడు రాజ్ మృతిపై కోటి భావోద్వేగం

-

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) కన్నుమూశారు. అయితే.. దీనిపై సంగీత దర్శకుడు కోటి స్పందించారు. వీరు ఇరువురు రాజ్ కోటి ద్వయంగా ఫేమస్ అయ్యారు. రాజ్ కోటి కలిసి చేసిన ఎన్నో సినిమాలు, వాటిలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గానే ఉన్నాయి.

ఇక తన ప్రాణ స్నేహితుడు, సోదర సమానుడు అయిన రాజ్‌ మరణించిన వార్త తెలుసుకున్న కోటి కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్ మృతి వార్త తెలిసి షాక్ కు గురయ్యానని వెల్లడించారు. రాజ్ ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, కుడిభుజాన్ని కోల్పోయినట్టుగా ఉందని కోటి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇటీవల ఓ ఫంక్షన్ లో రాజ్ ను కలిసి మాట్లాడానని తెలిపారు. రాజ్-కోటి బ్రాండ్ నేమ్ తో తామిద్దరం ఎన్నో పాటలను హిట్ చేశామని అన్నారు. తామిద్దరం జంటగా సంగీతం అందించే రోజుల్లో, ఒక రోజులో అనేక గంటల పాటు కలిసి పనిచేసేవాళ్లమని కోటి వివరించారు.

“నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నాను. నా రాజ్ చనిపోయారనే వార్తను తట్టుకోలేకపోతున్నాను. మొన్నీ మధ్యే ఓ సినిమా ఫంక్షన్‌లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు. ఈ రోజు ఉదయం హార్ట్ ఎటాక్‌తో ఆయన మరణించారని తెలిసి ఎంతో బాధపడ్డాను.

రాజ్ కోటిగా మేం ఇద్దరం ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం విడిపోయిన తరువాత కోటిగా నేను ఎన్ని సినిమాలు చేసినా… వాటిని కూడా రాజ్ కోటి పాటలు అనేవారు. మేం ఇద్దరం ఇరవై నాలుగు గంటలూ పని చేసేవాళ్లం. చక్రవర్తి దగ్గర మేం ఇద్దరం అసిస్టెంట్లుగా పని చేశాం. ముఠామేస్త్రి, హలోబ్రదర్ ఇలా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాం. మేం ఇద్దరం తెలుగులో ఓ ట్రెండ్‌ను సృష్టించాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version