ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారియర్లు రెచ్చిపోతున్నారు. వారిపై క్రమంగా వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వంలోని నేతలు, మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడంతో పాటు వారి పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారు.మరికొందరినీ బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఇప్పటికే అటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళకు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేశ్ రెడ్డి లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. అసభ్యకరంగా మాట్లాడుతూ తనతో గడపాలని గురజాల నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేశ్ రెడ్డి వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించారు. తనని బెదిరిస్తూ ఫోన్లు చేయడం, అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం వంటివి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది.