భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికం ఉండకూడదు. భార్యాభర్తలు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే వాళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవలు ఉండకుండా వాళ్ళ మధ్య బంధం బాగుంటుంది. అయితే భార్యాభర్తలు తప్పక షేర్ చేసుకునే విషయాలు గురించి చూద్దాం.
మీ భయాల గురించి చెప్పండి:
మీ భయాల గురించి కచ్చితంగా మీ పార్ట్నర్ కి చెప్పండి. భయాల గురించి దయద్దు. ఇలా చెప్తే మీ రిలేషన్షిప్ బాగుంటుంది.
లైఫ్ లో మీకు ఏం కావాలి..?
మీ లైఫ్ లో మీకు ఏం కావాలి వారి లైఫ్ లో వారికి ఏం కావాలి అనేది తెలిసి ఉండాలి. ఈ విషయాలని భార్య భర్తలు తప్పక షేర్ చేసుకోవాలి.
ఆర్థిక పరిస్థితి:
మీ ఆర్థిక పరిస్థితి గురించి కూడా వారికి తెలిసి ఉండాలి. ఆర్థిక పరిస్థితుల గురించి తెలియక పోవడం వలన కూడా ఇబ్బందులు వస్తాయి. కనుక ఈ విషయంలో అస్సలు దాపరికం ఉండకూడదు.
ఏం సాధించాలి:
మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది కూడా వారికి తెలిసి ఉండాలి ఏం ఇష్టం లేదో చెప్పుకోండి. మీ పార్ట్నర్ లో మీకు నచ్చని విషయాలు గురించి కూడా వారికి చెప్తూ ఉండండి. ఇలా చెప్పడం వలన వాళ్ళు అటువంటి విషయాలని చేయరు.
ప్రేమని పంచండి, సపోర్ట్ ఇవ్వండి:
మీ పార్టనర్ కి మీ ప్రేమని పంచండి అలానే వారికి సపోర్ట్ కూడా ఇవ్వండి. ఇవి చాలా ముఖ్యం. ప్రేమని సపోర్ట్ ని చూపిస్తే వాళ్ళకి మీరు ఉన్నారని భరోసా ఏర్పడుతుంది. చాలా మంది దాంపత్య జీవితంలో ఇటువంటి వాటిని అనుసరించరు కనీసం వాళ్ళ భార్యకి కానీ భర్తకి కానీ ఏం ఇష్టం అనేది కూడా వారికి తెలియదు. ఇలా ఉంటే ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఎలా ఉంటారు..? ఎప్పుడూ కూడా ప్రతి చిన్న విషయాన్ని ఇద్దరు షేర్ చేసుకుని చక్కగా కలిసి ఉంటే ఇబ్బందులు ఏమీ లేకుండా ఆనందంగా ఉండొచ్చు.