నా కూతురు కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది: కేసిఆర్

-

ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. ‘లిక్కర్ స్కాం బోగస్. అది నరేంద్ర మోదీ సృష్టి. లిక్కర్ పాలసీ అనేది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పాలసీ ఉంటుంది. నా కూతురికి దీనితో ఏ సంబంధం లేదు అని అన్నారు. నా కూతురు కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఆమెను విట్నెస్ కింద విచారించారు. ఇప్పుడు అపరాధి అంటున్నారు. ఈ స్కీంలో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు’ అని కేసిఆర్ అన్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వరా అని కేసీఆర్ ప్రశ్నించారు. వారు ఎక్కడికైనా పారిపోతారా అని అన్నారు. స్కామ్ విచారణ అంటూ అనవసరంగా అమాయకులను ప్రధాని నరేంద్ర మోడీ శిక్షిస్తున్నారని మండిపడ్డారు. ఆప్ చీఫ్ కేజీవాల్పై గెలిచే శక్తి లేకనే అరెస్ట్ చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి, 700 మంది ప్రజాప్రతినిధులను బీజేపీలోకి లాక్కున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version