మా అమ్మ సూసైడ్ చేసుకోవాలనుకోలేదు : కల్పన కూతురు

-

సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని వస్తున్న వార్తలపై ఆమె కూతురు తాజాగా స్పందించారు. ప్రస్తుతం కల్పన ట్రీట్మెంట్ పొందున్న నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రిలోనే మీడియాతో మాట్లాడారు.

‘మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు. నిద్రమాత్రల ఓవర్ డోస్ వల్లే అస్వస్థతకు గురయ్యారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. తొందర్లోనే మళ్లీ ఎప్పటిలాగా మీ ముందుకు వస్తారు. దయచేసి ఎలాంటి ఊహగానాలు, అసత్యప్రచారం చేయొద్దు’ అని కల్పన కూతురు మీడియాకు సవినయంగా వేడుకున్నారు.కాగా, కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news