ప్రపంచయాత్రికుడు, యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. నిన్న హెచ్ సీయూ భూములపై స్పందించిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అని.. తద్వారా భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు, అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
తాజాగా ఆయన మరో వీడియోను రిలీజ్ చేశారు.‘ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తే నీ పని ఐపోతుంది రేవంత్ అన్న..ఆ శాపం నీకు, నీ కుటుంబానికి తగులుతుంది.ప్రకృతి పగబడితే అది ఎంతటి వాడినైనా సర్వనాశనం చేస్తుంది’ అని అన్వేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ప్రపంచయాత్రికుడి స్పందనపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
రేవంత్ రెడ్డికి బుద్ది చెప్పిన నా అన్వేషణ.!
"ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తే నీ పని ఐపోతుంది రేవంత్ అన్న..
ఆ శాపం నీకు, నీ కుటుంబానికి తగులుతుంది..
ప్రకృతి పగబడితే అది ఎంతటి వాడినైనా సర్వనాశనం చేస్తుంది.." -నా అన్వేషణ@INCTelangana @AapannaHastham @Revanth_Sainyam @BRSparty pic.twitter.com/4pp8ZA07Wu
— Nalla Thaachu (@NallaThaachu) April 4, 2025