సనాతన చిట్కాలతోనే తన భార్య ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ నుంచి కోలుకుందని మాజీ క్రికెటర్, జాతీయ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ‘ఆమె బతకడానికి 3 శాతం మాత్రమే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు. అలాంటిది సనాతన వైద్య చిట్కాలతోనే ఆమెకు 40 రోజుల్లో క్యాన్సర్ నయం చేశాం.
రోజూ నిమ్మరసం, పచ్చి పసుపు, వేప ఆకులు, తులసి, గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌లతో కూడిన సిట్రస్ పండ్లు మరియు రసాలు ఆమె రోజువారీ ఆహారంలో భాగంగా ఉన్నాయి. మొత్తానికి నా భార్య కోలుకున్నందుకు సంతోషిస్తున్నాను’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. సనాతన ఆయుర్వేద వైద్యంలో ప్రాణాంతక వ్యాధులను నయం చేసే చిట్కాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.