మయన్మార్ లో సైన్యా దాష్టీకాలు ఆగడం లేదు. ప్రజాస్వామ్య ఆంగ్ సాంగ్ సూచి ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని చేజిక్కిచ్చుకుంది. అప్పటి నుంచి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునురుద్దరించాలని ఆదేశ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఈఆందోళనలను అక్కడి సైన్యం అణచివేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ప్రజల్ని నిర్ధాక్షణీయంగా చంపెస్తోంది. తాజాగా మరో దాష్టీకానికి దిగింది మయన్మార్ సైన్యం. శుక్రవారం మయన్మార్ లోని కయా రాష్ట్రంలోని మోసో గ్రామంలో దాదాపు 30 మందిని కాల్చి చంపింది సైన్యం. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత శరీరాలను కాల్చివేసినట్లుగా తెలిసింది. శరణార్ధుల శిబిరానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే సైన్యం మాత్రం సాయుధులైన తిరుగుబాటుదారులను కాల్చి చంపినట్లుగా పేర్కొంది.
గత 11 నెలల క్రితం ప్రజాస్వామ్య ఆంగ్ సాంగ్ సూచి ప్రభుత్వాన్ని గద్దె దింపిన సైన్యం అప్పటి నుంచి మయన్మార్ లో పాలనను చేపట్టింది. అప్పటి నుంచి ఆదేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల నుంచి వచ్చే నిరసనలను బలవంతంగా అణచివేస్తోంది అక్కడి ఆర్మీ.