సీఎం నివాసానికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తారా : నాదెండ్ల మనోహర్‌

-

రుషికొండలో రాజమహల్ నిర్మించుకుంటూ క్లాస్వార్ అంటారా? అని సీఎం జగనన్ను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పేదవాడికి సెంటు భూమే.. కానీ, ముఖ్యమంత్రి ఇంటికి 9 ఎకరాలు.. రూ.451 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సీఎం నివాసంలో పచ్చదనానికి రూ.21 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీల్లో కనీస వసతులు లేవని దుయ్యబట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మాట్లాడారు.”ముఖ్యమంత్రి గారూ ఇప్పుడు చెప్పండి.. ఎవరు పెత్తందారో? ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతా ఈ విదంగా. వ్యవహరించలేదు? రుషికొండపై టూరిజం ప్రాజెక్టు అంటూ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారు. న్యాయస్థానాల అఫిడవిట్లలోనూ అదే చెప్పారు. అటు బ్యాంకులను మోసం చేస్తూ కోర్టులకు తప్పుడు అపిడవిట్లు ఇచ్చారు. దమ్ముంటే రుషికొండపై నిర్మించేది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అని చెప్పండి” అని నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు.

నిజంగా ఈ ప్రాంతంలో రిసార్టులే నిర్మిస్తే 20 పడకలతో గదులు ఏ మూలకు సరిపోతాయి? అని జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదేండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి సీఎం క్యాంపు కార్యాలయం కోసం కొన్న ఫర్నేచరే.. ఇదంతా బయటకు తెలుస్తున్నా ఇంకా బ్యాంకులను మోసం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.. రెండు రోజుల క్రితం కూడా సంబంధిత మంత్రి టూరిజం ప్రాజెక్టని మాట్లాడారని ఆయన మండిపడ్డారు. జరుగుతున్న పనులు కొనుగోలు చేస్తున్న ఫర్నిచర్ చూస్తుంటే మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ కూడా రిషికొండపై నిర్మిస్తుంది సీఎం క్యాంపు కార్యాలయం అని దమ్ము, ధైర్యంతో చెప్పలేకపోతున్నారు. రుషికొండ నిర్మాణాలపై నాలుగేళ్ల నుంచి రచ్చ నడుస్తోంది.. పర్యావరణానికి తీవ్ర విధ్వంసం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయని నాదేండ్ల మనోహర్ విమర్శలు చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version