దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా: రేవంత్‌ రెడ్డి

-

పరకాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ అని, అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది అని ఆయన హామీ ఇచ్చారు. మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని, కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు అని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలన్నారు రేవంత్‌ రెడ్డి.

ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, భూమిలేని పేదలకు భూపంపిణీ చేశాం. బడి, గుడి, నీళ్లు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యమే. ‘దొర ఏందిరో’ అని పిడికిలి ఎత్తింది ఇందిరమ్మ రాజ్యం. ఎస్సీ, ఎస్టీలు పదవులు అనుభవించేలా ఇందిరమ్మ రాజ్యం చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను ఇందిరమ్మ రాజ్యం ఇచ్చింది’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘కొండా దంపతులు పరకాల నుంచి వెళ్లాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టారు. ఇన్నేళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అణచివేతను తట్టుకున్నారు. కడుపులో పెట్టుకొని కాపాడే రేవూరి మీకోసం వచ్చాడు. నిండు చెరువులా సభకు జనం కదిలివచ్చారు. సాయుధ రైతాంగ పోరాటానికి పరకాల ఫిరంగిలా మారింది. తెలంగాణ ఉద్యమాన్ని పరకాల ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది అని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version