గడపగడపలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు : నాదెండ్ల మనోహర్‌

-

ఏపీలోని గుంటూరు వేదికగా వైసీపీ ప్లీనరీ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. అయితే రెండు రోజులుగా జరిగిన వైసీపీ ప్లీనరీపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. సీఎం జగన్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని, గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పుకోవడం సరికాదన్న నాదెండ్ల మనోహర్.. గడపగడపకు కార్యక్రమం విఫలం కావడంతో సీఎం జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చాక రూ.1.27 లక్షలతో రైతులను ఆదుకున్నట్టు జగన్ అంటున్నారని, అదే నిజమైతే వైసీపీ పాలనలో 3 వేల మంది రైతులు ఎందుకు బలవన్మరణానికి పాల్పడినట్టు? అని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు నాదెండ్ల మనోహర్. ప్రతి మహిళ ఖాతాలో రూ.37 వేలు జమ చేశామని చెబుతున్నారని, అయితే డ్వాక్రా మహిళల సొమ్ము రూ.2 వేల కోట్లు ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు నాదెండ్ల మనోహర్. నిజంగానే మేనిఫెస్టోలో 95 శాతం అమలు చేశారా? అయితే మీకు దమ్ముంటే మార్చి లేక ఏప్రిల్ లో ఎన్నికలు జరపండి అని సవాల్‌ విసిరారు నాదెండ్ల మనోహర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version