ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్… ఎట్టకేలకు కలవబోతున్న సామ్ చైతు!

-

నాగచైతన్య, సమంత ఓ టైం లో టాలీవుడ్ బెస్ట్ కపుల్… కానీ ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు. కానీ ఈ జంట విడిపోయిన వార్త తెలిసిన దగ్గర నుంచి వారి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

 

ఇక సమంత అయితే యశోద ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఎమోషనల్ ఇంటర్వ్యూ అందరినీ కదిలించింది. ఇక యశోద సినిమాకు సైతం పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఆల్రెడీ ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కూడా అయింది. అయితే ఇప్పుడు సమంత, నాగ చైతన్యల మీద మరో వార్త పుట్టుకొచ్చింది. ఇందులో ఎంత నిజముందో తెలియడం లేదు గానీ జాతీయ మీడియాలో వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.

ఇక అసలు విషయం ఏంటంటే సమంత.. నాగ చైతన్య ఒక ప్రాజెక్టు కోసం జతకట్టబోతున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు విడిచిపెట్టి, వృత్తిపరంగా కలిసి పనిచేయడానికి సిద్ధం అయినట్లు వినిపిస్తుంది.. అదే కనుక జరిగితే ఈ జంటను తెరపై చూసేందుకు అభిమానులు థియేటర్ లకు క్యూ కడతారు.. ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version