పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలు బయటపెట్టిన నాగబాబు..!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన సొంతంగా పార్టీ పెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలవుతుంది. కానీ అధికారంలోకి మాత్రం రావడం లేదు. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి పార్టీ ని తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అధికారంలో లేకుండా ఇన్నేళ్లపాటు పార్టీని నడిపించడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని వేలకోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే ఇలా రాజకీయ పార్టీలను నడపగలరు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ విషయంపై నాగబాబు స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబును యాంకర్ ప్రశ్నిస్తూ… పవన్ కళ్యాణ్ కు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు అని అడగగా.. దానికి నాగబాబు మాట్లాడుతూ.. ఏ సినిమా చేసినా ఆ డబ్బుతో తాను బతకడం కోసం కొంత ఉంచుకొని .. మిగతా డబ్బును ప్రజలకే ఖర్చు చేస్తాడు.. పార్టి కోసమో.. ప్రజల కోసమో.. మిలిటరీ వాళ్ళ కోసమో.. అలాగే తుఫాను , వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో కూడా ఎవరికైనా సహాయం కావాలి అంటే పవన్ కళ్యాణ్ సహాయం చేస్తారు. ఇప్పుడు రైతుల కోసం కూడా చాలా డబ్బు ఇచ్చారు. అంతకుముందు ప్రజలకు, ఉద్దానం కిడ్నీ బాధితులకు కూడా డబ్బు సహాయం చేశారు అంటూ పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు తెలిపాడు.

వీలైనంతవరకు సాయం కోసం వచ్చిన వారికి డబ్బు పంచుకుంటూ వెళ్తారు. ప్రస్తుతం తన దగ్గర ఏమీ లేదు. పవన్ కి సినిమా నుంచి వచ్చే ఆదాయం తప్ప వేరే వ్యాపారాలు కూడా లేవు. పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండవు. ఒకవేళ డబ్బు కావాలి అంటే సినిమాలు చేస్తాడు అంటూ నాగబాబు తెలిపారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version