రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి : మెగాబ్రదర్ నాగబాబు ప్రతిపాదన

-

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… నిత్యం ఏదో ఒక సంఘటన పై పై స్పందిస్తారు నాగబాబు. అయితే తాజాగా రాష్ట్రపతి అంశంపై స్పందించారు నాగబాబు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని… ఇలాంటి తరుణంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలని సూచనలు చేశారు నాగబాబు.

అంతవరకు బానే ఉంది కానీ… రాష్ట్రపతిగా రతన్ టాటా పేరు సూచించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు నాగబాబు. దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త రతన్ టాటా ను తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు. పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్… సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందు పదవి కాలం దాదాపు మరో ఏడాది వరకు ఉంది. దీనిపై జాతీయ స్థాయిలో కూడా కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నా నిర్దిష్టంగా అనే అంశం పైన మాత్రం క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే నాగబాబు ఈ బాంబ్ పేల్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version