పెగాసస్ పై రక్షణ శాఖ కీలక ప్రకటన.. మాకు ఎలాంటి సంబంధం లేదు!

-

దేశంలో గత కొన్ని రోజులుగా పెగాసస్ వ్యవహారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెగాసస్ వివాదంపై… వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని కూడా నిలదీశాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. అటు దేశ వ్యాప్తంగా కూడా పెగాసస్ వ్యవహారంపై… విపక్షాలు మండి పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో పెగాసస్ వివాదంపై మొదటిసారిగా రక్షణ శాఖ స్పందించింది. పెగాసస్ వ్యవహారం తో తమకు ఎలాంటి సంబంధం లేదని బాంబు పేల్చింది రక్షణ శాఖ. ఈ మేరకు పెగాసస్ వివాదంపై రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. పెగాసస్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని.. ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ ఓ సంస్థతో ఇలాంటి ఒప్పందం చేసుకోలేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని…. కాబట్టి ఉభయ సభల్లో దీని పై చర్చించడం సబబు కాదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version