నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంకు ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ 20 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు.. స్పిల్ వే ద్వారా 2లక్ష 95 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 588.80 అడగులుగా ఉంది. జులై చివరి వారం నుంచి జలాశయానికి ప్రారంభమైన ప్రవాహంతో ఈనెల 11 నుంచి 26 గేట్లను ఎత్తి 18 రోజులుగా నీటి విడుదల చేపట్టారు. ఎగువ నుండి వరద ప్రవాహo కాస్త తగ్గుముఖం పట్టడంతో గేట్లు మూసి వేసిన అధికారులు.. మళ్ళీ ప్రవాహం బట్టి గేట్లను ఎత్తుతూ.. మూస్తూ వస్తున్నారు.