నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం..!

-

నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మెడికల్ కళాశాలలో స్వీపర్ గా పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళ మీద సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఒక మహిళా పై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాల పరిధిలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కార్యాలయంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. శుక్రవారం ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితురాలు కథనం మేరకు స్వీపర్గా పనిచేస్తున్న ఆమె రోజూ లానే పనులు పూర్తి చేసుకుందట.

గురువారం సాయంత్రం హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్యాలయంలో క్లీన్ చేసేందుకు వెళ్ళింది అక్కడే బిజినపల్లి మండల పాలెం గ్రామానికి చెందిన మహేష్ సూపర్వైజర్ గా పని చేస్తున్నాడట. తనమీద కన్నేసి కార్యాలయానికి లోపల నుండి గడియ పెట్టి బలవంతం చేయబోయాడు. వెంటనే ఆమె అరుపులు కేకలు వేస్తే వేస్తూ బయటికి పరుగులు తీసింది తర్వాత తోటి వారితో చెప్పుకోవడంతో మహేష్ ని పట్టుకుని దేహశుద్ధి చేశారు బాధితురాన్ని బెదిరించి కేసు నమోదు చేయకుండా రాజీకుదుచ్చే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version