విశాఖలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరికి మేలు చేయాలని ఆ పార్టీ లో చేరాలో చెప్పాలని అన్నారు జగన్ ని జైలు పాలుచేసిన పార్టీతో షర్మిల చేతులు కలిపారని మంత్రి రోజూ అన్నారు తెలంగాణ నుండి రావాల్సిన ఆరువేల కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి రావాల్సిన 1,8,000 కోట్లు రాబట్టాలని షర్మిల కి మంత్రి రోజ సలహా ఇచ్చారు.
రాష్ట్ర వాటాల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా ని షర్మిల ప్రశ్నించాలి అని అన్నారు చంద్రబాబు పవన్ షర్మిల నోన్ లోకల్ పొలిటిషియన్లు అని ఎద్దేవా చేశారు రోజా 2024 ఎన్నికలు తర్వాత వాళ్లంతా తెలంగాణకి పారిపోతారని మంత్రి రోజా అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సింహాలాంటి వ్యక్తి అని అన్నారు ఎన్నికల కి సింగిల్గానే వెళ్తారని అన్నారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైసిపి గెలుపు ఖాయమని మంత్రి రోజా అన్నారు.