లారీ హారన్ కి రోడ్డుమీద నాగిని డాన్స్.. వీడియో వైరల్

-

లారీ హారన్ సౌండ్ కి రోడ్డుపై నాగిని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు కొందరు యువకులు. దక్షిణ కర్ణాటకలో రోడ్డుపై బైకర్స్ వెళుతున్నారు. వారి వెనకాల ఓ లారీ వచ్చింది. అయితే లారీ హారన్ కొట్టడంతో యువతకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఓ 20 మంది తమ బైకులను రోడ్డు పక్కన పార్క్ చేశారు. ఇంకేముంది లారీ హారన్ కి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. మిగతా వారు అరుస్తూ.. వారిని ఉత్సాహపరిచారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఇద్దరు, ముగ్గురు అయితే రోడ్డుపై పడుకుని మరీ డాన్స్ చేశారు. ఇక చేసేదేమీలేక ఆ లారీ డ్రైవర్ మాత్రం తల పట్టుకొని వెయిట్ చేశాడు. అసలే నాగిని డాన్స్ అంటే యువతలో క్రేజ్ ఎక్కువ. దీంతో ఈ వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతుంది. యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ట్రోల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version