ఘనంగా.. నాగోబా జాతర ప్రారంభం

-

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి మెస్రం వంశస్థుల మహాపూజలతో జాతర షురూ అయింది. ఈసారి కొత్త ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. జాతరకు సంబంధించి ఐటీడీఏ ఏర్పాట్లు చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గఢ్, బిహార్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. మంచిర్యాల జిల్లాలోని కలమడుగుకు కాలినడకన వెళ్లి గోదావరి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలతో అభిషేకం చేసిన అనంతరం జాతర ప్రారంభమైంది. అధికారికంగా ఐదు రోజులపాటు కొనసాగుతుంది.

రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఏపీ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. విదేశాల నుంచి పర్యాటకులు, సందర్శకులు తరలిరానున్నారు. శనివారం సాయంత్రం ఎడ్లబండ్లతో గోవాడ్‌కు మెస్రం వంశీయులు చేరుకుంటారు. రాత్రి నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి నాగోబాకు అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి మహాపూజలు నిర్వహిస్తారు. ఆలయంలో ఏడు రకాల పాముల పుట్టలను తయారు చేసి, వాటికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటు ఆదివాసుల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version