తెలంగాణ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డికి మూడు రోజుల క్రితం కరోనా సోకిందన్న సంగతి తెలిందే. దీంతో ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం నాడు చేరారు. అలానే ఆరోజున ఇటీవల కాలంలో తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని నర్సింహారెడ్డి సూచించారు.
క్వారంటైన్ లోకి కూడా వెళ్లాలని ఆయన సూచించారు. అయితే నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా మారినట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండడంతో బంజారాహిల్స్ లో ఆయన చికిత్స పొందుతున్న హాస్పిటల్ లోనే ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ కు తరలించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కరోనా సోకింది. కరోనా సోకిన వారంతా చికిత్స తీసుకొని దాదాపుగా కోలుకొన్నారు.