గ్రామసభల్లో బీఆర్ఎస్ నేతల నిరసనలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. నాలుగు నెలలు ఆలస్యమైనా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నం. గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. గ్రామ సభలకు డిస్టర్బ్ చేస్తూ, ప్రజలను రెచ్చగొడుతున్నారు. పదేళ్లలో చేసింది లేదు, మేము చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. అర్హులను ఎంపిక చేసేందుకే గ్రామసభలు. కాంగ్రెస్ శ్రేణులకే పథకాలు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ కూడా కాలేదు.
ప్లాన్ ప్రకారం గ్రామసభలను అడ్డుకునే పనిలో గులాబీ శ్రేణులు ఉన్నారు. పేద ప్రజలకోసం రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్లు ఇస్తున్నాం. అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టే వెదవలను కట్టేసి కొట్టండి. ఉద్యమాల పేరుతో కోట్లు కొల్లగొట్టి, ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జనవరి 26 నుండి మా పథకాలు అర్హులకు అందుతాయి. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ చాప్టర్ క్లోజ్. పార్టీలో మిగిలిన నలుగురు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. బావా బామ్మర్డులు ఇద్దరు తలుపులు పెట్టుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే. దున్నపోతుల్లా తిని బలిసిన నేతలు ఇప్పుడు లొల్లి చేస్తున్నారు. పేదల బతుకులు ఆగం చేసేలా ప్రవర్తిస్తే తోలు తీసి కట్టేస్తాం. బీఆర్ఎస్ హయంలో జరిగిన అక్రమాలు మా ప్రభుత్వంలో జరగవు. కాంగ్రెస్ కు మంచిపేరు వస్తుంటే గులాబీ పార్టీ ఓర్చుకోవట్లేదు. హద్దు మీరి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోము. గ్రామ సభల్లో గొడవలు చేసేది బీఆర్ఎస్ నాయకుల తొత్తులు మాత్రమే. పేదలను అయోమయానికి గురి చేసి పబ్బం గడుపుతున్నారు. నాలుగు రోజులు ఆలస్యమైనా అసలైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తాం అని నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.