ప్రెస్‌మీట్‌లో నళిని శ్రీహరన్‌ భావోద్వేగం.. ఆసక్తికర వ్యాఖ్యలు

-

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు నిన్న జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఒకరైన నళిని శ్రీహరన్‌ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నళిని భావోద్వేగానికి గురైంది. రాజీవ్‌ కుమార్తె, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆదివారం తనను జైలులో కలిశారని, రాజీవ్‌ హత్యపై ప్రియాంక పలు ప్రశ్నలు సంధించిందని నళిని తెలిపింది. ఈ సందర్భంలో ప్రియాంక భావోద్వేగానికి గురైందని, ఆ సమయంలో తాను సైతం ఏడ్చినట్లు చెప్పింది.

తన భర్తను తిరుచ్చి ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తిరుచ్చి ప్రత్యేక శిబిరంలో తన భర్తను కలువబోతున్నట్లు తెలిపిన నలిళి.. తనకు ఓ కూతురు ఉందని తెలిపింది. కూతురు తన తండ్రిని కలుసుకునేందుకు ఉత్సాహంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం తాను సంతోషంగా లేనని పేర్కొన్న నళిని, తర్వాత తాను తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నానని.. ఇందులో కమలా సర్‌ మెమోరియల్‌ ఒకటి అని చెప్పింది. అలాగే కేసు నుంచి బయటపడేందుకు సహకరించిన వారందరినీ కలవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నట్లు పేర్కొంది. గాంధీ కుటుంబానికి చాలా కృతజ్ఞురాలునని, వారిని కలిసేందుకు అవకాశం వస్తే.. తప్పకుండా కలుస్తానంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version