ఏపీ అప్పుల మయంగా మారింది : నల్లారి కిరణ్ కుమార్

-

నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు. ఇందుకోసం ఎవరికీ కప్పు టీ కూడా ఇవ్వలేదు. పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాలి అని మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చాలా సార్లు చెప్పాను. వాళ్లు వినకపోవడంతోనే నేను మీడియా ముందుకు వచ్చా. నరేంద్ర మోడీని మూడు నెలల ముందు కలిసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఇప్పటికీ కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకూ సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ఒక వరం. పోలవరం పనులను త్వరగా పూర్తి చేసుకోవాలి.

23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 7, లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, 900 మెగా వాట్ల విద్యత్తు ఉత్పత్తి పోలవరంతోనే సాధ్యం. పక్క రాష్ట్రాలతో త్వరగా ఒప్పందాలు పూర్తి చేసుకోవాలి. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణాలకు జరిగిన అన్యాయంపై నేను సీఎంగా ఉన్నప్పుడు సుప్రింకోర్టులో స్టే తెచ్చాం. ఆ స్టే ఇప్పటికీ అలాగే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసికట్టుగా కృష్ణా జలాల వినియోగంపై శ్రద్ద పెట్టాలి. అమరావతిని త్వరగా పూర్తి చేసుకోవాలి. ఎంత వేగంగా అభివృద్ది చేస్తే, అంతకంటే వేగంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. ఏపీ అప్పుల మయంగా మారింది. అభివృద్దిలో బాగా వెనుకపడ్డాం. అభివృద్దిని వేగవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version