బెల్లం చాయ్ టేస్టీగా చేయాలా..? ఈ టిప్స్ పాటించండి

-

చలికాలంలో చాయ్ మీదకు మనసు ఊరికే వెళ్ళిపోతుంది. చలిని తట్టుకోవడానికి చాలామంది చాయ్ ని ఆశ్రయిస్తారు ఒక్కోసారి రోజుకు మూడు నాలుగు సార్లు చాయ్ తాగే అలవాటు ఉన్నవారు చాలామంది కనిపిస్తారు.

కొంతమంది చాయిలో వెరైటీల కోసం చూస్తారు. ముఖ్యంగా బెల్లం చాయ్ మీద మక్కువ ఎక్కువ చూపిస్తారు. అయితే బెల్లం చాయ్ చేయడంలో మాత్రం పొరపాట్లు చేస్తారు దానివల్ల బెల్లం చాయ్ టేస్టీగా అవ్వదు. ప్రస్తుతం ఎలాంటి పొరపాట్లు లేకుండా బెల్లం చాయ్ ఎలా చేయాలో తెలుసుకుందాం

చాయ్ చేసేటప్పుడు కొలతలు చాలా ముఖ్యం. రెండు కప్పుల పాలు తీసుకుంటే రెండు కప్పుల వాటర్ కలపాలి. కొలతల్లో తేడా జరిగితే చాయ్ రుచిలో తేడా వస్తుంది.

చాయ్ లో అల్లం కలపండి, మరింత టేస్టీగా ఉంటుంది. వీలైతే తులసి ఆకులు కూడా వేయండి. ఇంకా రుచిగా ఉంటుంది.

చాయ్ చేసేటప్పుడు పాలను బెల్లాన్ని ఒకే చోట కలపకూడదు. ముందుగా నీళ్లలో బెల్లం సహా అల్లం ఇంకా టీ పౌడర్ వేసుకోవాలి. చివరకు పాలను వాటిల్లో కలిపి చాయ్ తయారు చేయాలి. ఇలా ఎందుకు చేయాలో తెలుసుకుందాం.

బెల్లం చాయ్ చేసేటప్పుడు పాలతో సహా బెల్లాన్ని ఒకే దగ్గర కలిపి స్టవ్ మీద వేడి చేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే చల్లని పాలలో బెల్లం వేస్తే విరిగిపోయే అవకాశం ఎక్కువ.

ఇలా కాకుండా చాయ్ కోసం అంతా సిద్ధం చేసుకుని చివరకు మరిగించిన వేడిపాలను పోయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా చేయడం వల్ల పాలు విరిగే సమస్య ఉండదు. అంతేకాకుండా చాయ్ మంచి రుచిగా ఉంటుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version