ట్రంప్ గద్దె దిగే సమయం వచ్చేసిందా….!!!!

-

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కొత్త తలనెప్పి మొదలయ్యింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ చేస్తున్న ఎదురు దాడులు ట్రంప్ కి అధికారం దూరంచేసేవిగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ పై తాజాగా డెమోక్రాట్లు పెట్టిన అభిశంసన అందుకు తగ్గట్టుగా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసి ట్రంప్ పై దర్యాప్తు చేస్తూ ఇచ్చిన కీలక ఆదేశాలు ఇప్పుడు అమెరికాలో అలజడి సృష్టిస్తున్నాయి.

డెమోక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష బరిలో ఒకరిగా ఉన్న జో బైడెన్ ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉక్రెయిన్ దేశాధ్యక్షుడుతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేశారని. అందుకు ససమేరా అంటే ఆ దేశానికి ఇవ్వాల్సిన మిలటరీ నిధులని ఆపేస్తామని బెదిరించినట్టుగా ఓ కధనం రావడంతో డెమోక్రాట్లు ప్రవేశ పెట్టిన అభిసంసనపై నాన్సీ ఆదేశాలు జారీ చేశారు.

 

అయితే ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ నేతల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అమెరికా సెనేట్ లో రిపబ్లికన్స్ బలం ఎక్కువగా ఉండటంతో ఈ అభిశంసన ప్రతినిధుల సభలో గెలుపొందినా సెనేట్ లో వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కి ఈ పరిణామాలు భారీ నష్టాన్ని మాత్రం తెచ్చి పెట్టే అవకాశం ఉందనేది డెమోక్రటిక్ పార్టీ అంచనా..

Read more RELATED
Recommended to you

Exit mobile version