నందమూరి ఎన్టీ రామారావు ఇంట పెను విషాదం నెలకొంది. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ ఇంట్లో చాలామంది మృతి చెందగా… తాజాగా మరొకరు మరణించారు. నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజా కాసేపటి క్రితమే మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో నందమూరి పద్మజ ఈరోజు స్వర్గస్తులయ్యారు. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ అన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరణించింది కూడా నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ. ఈమె దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి కూడా అవుతుంది. అంతేకాదు హీరో నందమూరి చైతన్య కృష్ణ వాళ్ళ అమ్మనే ఈ పద్మజ. దీంతో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలోకి నెట్టి వేయబడింది. ఈ సంఘటన తెలియగానే సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరారు. అటు పలువురు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.