శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో గుట్టపై నుంచి బండరాళ్లు దొర్లిపడ్డాయి. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం నెలకొంది.

అటు శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దింతో శ్రీశైలం డ్యామ్ డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం వస్తోంది. ఈ తరుణంలోనే ప్రాజెక్ట్ 10 క్రెస్టు గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ. అటు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,53,819 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం
భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో గుట్టపై నుంచి దొర్లిపడ్డ బండరాళ్లు
దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం pic.twitter.com/x28BDCHRY8
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2025